కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ కో ఏఈ రాంప్రసాద్, ఎంపీడీవో భారతి, అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ ఉన్నారు.