ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలి: పోచారం

85చూసినవారు
ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలి: పోచారం
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ లో సోమవారం రూ. 43 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం రూ. ఏడు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్