జుక్కల్: అగ్రికల్చర్ ఆఫీస్ ముందు మురికి నీటితో దుర్వాసన
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల అగ్రికల్చర్ కార్యాలయం ముందు మొత్తం మురికి నీళ్లతో నిండిపోయి దుర్వాసనతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆ కాలనీ వాసులు గురువారం అంటున్నారు. వెంటనే చెత్తాచెదాన్ని తొలగించి మురికి నీరు నిల్వ లేకుండా బాగు చేయాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.