పెద్దపల్లి: అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారు
కాంగ్రెస్ అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో కాంగ్రెస్ 6 అబద్దాలు, 66 మోసాలు పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీ అనంతరం జెండా చౌరస్తా వద్ద కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గోమాస శ్రీనివాస్, గొట్టిముక్కల సురేష్ రెడ్డి పాల్గొన్నారు.