పెద్దపల్లి: ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూ సేకరణ చెల్లింపులపై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గంగయ్య, సురేష్, గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు.