ఎల్లారెడ్డి మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం ఒకే రోజు 60 వ్యవసాయ విద్యుత్ మోటార్ల బిల్లులు చెల్లించినట్లు ఫోర్మెన్ గంగాధర్ తెలిపారు. మొత్తం 60 బోర్ మోటార్లకు సంబంధించిన 24, 416 రూపాయల బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోర్మెన్ గంగాధర్ తో పాటు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సిద్దెందర్ రెడ్డి, లైన్ మెన్ బాలకిషన్ గౌడ్, ఏఎల్ ఎం ఇస్మాయిల్, సిఎల్ రియాజ్ రైతులు పాల్గొన్నారు.