నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మాల్ తుమ్మెద రైతు వేదికలో సోమవారం మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు త్రాగునీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ. గ్రామాలలో తాగునీటి సరఫరా సహాయకులు క్రమం తప్పకుండా త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ మోతాదులో కలపాలని నాణ్యమైన నీటిని గ్రామస్తులకు అందించాలని సూచించారు.