గండి పడిన కాలువను పరిశీలించిన ఎంపీపీ
కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్పేట గ్రామం గుండా వెళ్లే కెఎల్ కెనాల్ కట్ట దెబ్బతిన్నట్లు తెలుసుకున్న ఎంపీపీ శనివారం పరిశీలించారు. డీఈతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మెన్ శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచి కటకం నందయ్య పాల్గొన్నారు.