పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం దిశగా చర్యలు: కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాలలో అందించే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో పూర్వ ప్రాథమిక విద్యపై అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి బృంద సభ్యులు, అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు రాహుల్, అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సభ్యులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.