ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష
ధరణి దరఖాస్తులను తహసీల్దారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ధరణి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని, మండలాలలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య సింగల్ డిజిట్ దాటకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు గంగయ్య, హనుమనాయక్ పాల్గొన్నారు.