నేరాలను నిర్మూలనకు సహకరించాలి: ఏసిపి

80చూసినవారు
నేరాలను నిర్మూలనకు సహకరించాలి: ఏసిపి
నేరాల నిర్మూలనకు అందరి సహకారం అవసరమని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ పేర్కొన్నారు. సోమవారం సుల్తానాబాద్ లో మండలంలోని రైస్ మిల్లర్లు, ఇటుక బట్టి యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మిల్లర్లు, బట్టిల యజమానులకు వలస కార్మికుల పూర్తి వివరాలు తెలిసి ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్