పెద్దపల్లి: గుండెపోటుతో యువకుడు మృతి

61చూసినవారు
పెద్దపల్లి నగరంలోని ఒక మెడికల్ షాప్ వద్ద జరిగిన ఘటనలో జలుబు గోలి కొనుగోలు చేసేందుకు వచ్చిన 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం, అను అనే యువకుడు గత కొన్ని రోజులు నుంచి జలుబుతో బాధపడుతున్నాడు. ఆ రోజు అతను దవాఖానలో వైద్యుల సలహా మేరకు జలుబు మందులు కొనుగోలు చేసేందుకు షాప్‌కు వెళ్లాడు.

సంబంధిత పోస్ట్