వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం సెలవు దినం సందర్భంగా 35 వేల 928 మంది భక్తజనం దర్శించుకున్నారని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను, తలనీలాలు సమర్పించుకుని, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. స్వామివారి ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. రేపు సోమవారం కావడంతో అధిక సంఖ్యలో వచ్చారు.