దుమ్ముగూడెం: విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దుమ్ముగూడెం మండలలో బీహార్‌కు చెందిన వికాస్ కుమార్(28) సీతారామపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన పనులకు వచ్చాడు. బుధవారం విద్యుత్తు వైరింగ్ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తోటి కార్మికులు అతడిని వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.