మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం రెండో రోజు క్రీడలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జూనియర్, సీనియర్ గర్ల్స్ కబడ్డీ పోటీలలో ప్రథమ బహుమతులు సాధించిన హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీయులకు మధిర ఎమ్మార్వో రాంబాబు చేతులు మీదుగా బహుమతులు అందజేశారు.