ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత అవసరం
నేటి సాంకేతిక, యాంత్రిక సమాజంలో ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని మండల వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. మణుగూరులోని శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.