వాంకిడి మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ వివరాల ప్రకారం.. వాంకిడి మండలం సవాతి గ్రామంలో గంజాయిని విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షిండే శంరావు ఇంట్లో ప్రభుత్వ నిషేధిత గంజాయి 1. 6 కేజీ సుమారు విలువ 40, 000/- లభ్యమయ్యాయి. గంజాయిని, నిందితున్ని వాంకిడి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ తెలిపారు.