నిర్ధిష్ట ప్రమాణాలతోనే మంచినీటి సరఫరా చేయాలి

62చూసినవారు
నిర్ధిష్ట ప్రమాణాలతోనే మంచినీటి సరఫరా చేయాలి
మిషన్ భగీరథ ద్వారా నిర్ధిష్ట ప్రమాణాలతోనే ప్రజలకు త్రాగునీటి సరఫరా చేయాలని ఆ సంస్థ నాణ్యతా ప్రమాణాలు విభాగం ఏఈ చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అశ్వారావుపేట మండలంలోని మద్దికొండ, జమ్మిగూడెం, అచ్యుతాపురం పంచాయతీల్లో బుధవారం మిషన్ భగీరథ మంచినీటి సరఫరా, నీటి నిల్వ, వినియోగం, క్లోరినేషన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇంటింటికెళ్ళి నీటి సరఫరా, లభ్యత, నాణ్యతను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్