భద్రాచలం పట్టణంలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం పరిశీలించారు. ఆయా కాలనీల్లో తిరిగిన ఎమ్మెల్యే నూతనంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులను తనిఖీ చేశారు. ఎంతవరకు పనులు పూర్తి చేశారో ఇంకా అక్కడ కావాల్సిన పనులపై కాలనీ వాసులతో మాట్లాడారు.