జిల్లాలోని భూ సమస్యలు పరిష్కారానికై చేపట్టాల్సిన చర్యలుపై శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి రెవెన్యూ అధికారులతో ఐడిఓసి కార్యాలయం శనివారం స్టేట్ చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల అవసరాల కోసం భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే చేపట్టాలని దానికి గాను సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూమి వివరాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు.