ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
పాల్వంచ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు, ల్యాబ్, ఎక్స్రే రూమ్, ఫార్మసీ. ఆపరేషన్ థియేటర్స్ తనిఖీ చేసి, డాక్టర్స్ తో రోగుల వివరాలు వారికి అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు.