విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
పాల్వంచ కుంటినాగులగూడేనికి చెందిన తురసం ప్రియ (30) పాత పాల్వంచ రిలయన్స్ బంక్ సమీపంలో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులకు గతనెల 29న వెళ్లింది. పనులు చేసే క్రమంలో పక్కన విద్యుత్తు తీగెలకు ఆమె పట్టుకున్న ఇనుప రాడ్డు తగిలి విద్యుదాఘాతానికి గురయింది. క్షతగాత్రురాలిని కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందింది.