నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలో పథకాల ఎంపిక ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. పసుపుల గ్రామంలో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు.