నాగర్ కర్నూల్: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

82చూసినవారు
నాగర్ కర్నూల్: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఉడతనూరి సౌమ్య(17) వనస్థలిపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులు డిన్నర్ కు వెళ్లగా తన రూమ్ లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక విద్యార్థి గమనించి ప్రిన్సిపాల్, వార్డెన్కు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్