మహబూబ్ నగర్ పోలీసులు మానవత్వం చాటారు. సోమవారం గ్రూప్-2 పరీక్ష కేంద్రమైన జేపీఎన్సి ఇంజనీరింగ్ కళాశాల వద్ద బందోబస్తు, పరీక్షల నిర్వాహణా పరిస్థితులను జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ జిల్లా ఎస్పీ జానకితో కలిసి పర్యవేక్షించారు. పరీక్ష రాయడానికి గర్భిణితో ఒక మహిళ గేటు దగ్గరకురాగా గేటు నుంచి పరీక్ష రాసే హాల్ చాలాదూరంలో ఉన్నందున డీజీపీ, ఎస్పీ మానవతా దృక్పథంతో స్పందించి ఆమెను పరీక్ష హాల్ వరకు కారులో దింపారు.