తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం అమరచింత మండల కేంద్రంలోని మార్క్స్ భవన్ లో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ. ఈనెల 25న మహబూబ్ నగర్ లో జరిగే మహాసభలకు పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.