మాగనూర్: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన టీచర్

67చూసినవారు
మాగనూర్: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన టీచర్
ఆల్ ఇండియా సివిల్ సర్వీసులో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బి. దీప ఎంపికైనట్లు డి ఎస్ ఓ వెంకటేష్ శెట్టి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 23, 24 రెండు రోజులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ మహిళా రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొని ప్రతిభ చాటడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్