అమరచింత: అయ్యప్ప స్వామి మహా పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
అమరచింత మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన అయ్యప్ప స్వామి మహా పూజలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. మహా పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.