ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన రన్లో విద్యార్థులతో పాటు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ సీతారాం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని శరీర ధ్రుడత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.