వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేటకు చెందిన బంకల లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైంది. మెరుగైన చికిత్స కొరకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 1, 50, 000 ఎల్ఓసిని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితురాలు కుమారుడు వెంకటయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పర్వతాలు, సురేష్ గౌడ్, నాగశేషి, నాగిరెడ్డి, వెంకటయ్య గౌడ్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.