Oct 27, 2024, 02:10 IST/
నవంబర్ 2 నుంచి కార్తీక మాస ఉత్సవాలు
Oct 27, 2024, 02:10 IST
తెలంగాణలోని అన్ని ఆలయాల్లో నవంబర్ 2 నుంచి కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని పేర్కొంది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.