మక్తల్
కృష్ణ: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం కృష్ణ మండలంలోని కున్ని గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కసునూరుకు చెందిన జుట్లా గోపాల్(27) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపనికి గురై రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ఆస్పత్రికి తరలించారు.