ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది వ్యతిరేక శక్తులు వర్గీకరణకు అడ్డంకి వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్గీకరణకు మాదిగ కులస్తులందరూ రాజకీయాలకతీతంగా ఏకం కావాలన్నారు.