జైపూర్ మండలంలో నిర్వహిస్తున్న వీవీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఆదివారం వీక్షించారు. ఎమ్మెల్యే కాసేపు బ్యాటింగ్ చేసి సందడి చేశారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కువ మంది క్రికెట్ ఆడుతున్నారని పేర్కొన్నారు. దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ కూడా పిల్లలు ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారని అక్కడి స్మృతులను గుర్తు చేసుకున్నారు.