మందమర్రి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో 2001-2002 లో పదోవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం అపూర్వంగా నిర్వహించారు. ఇన్ని ఏళ్ల తర్వాత ఉద్యోగాలు సంసార జీవితంలో బిజీగా ఉంటున్న వీరంతా ఒక్క చోటికి చేరి సందడి చేశారు. 80 మంది విద్యార్థులు ఆనాటి విద్యార్థులు ఒకే వేదిక మీద కలవడంతో కొందరు ఉద్వేగానికి లోనయ్యారు.