మందమర్రిలో ఇటీవల ట్రైనింగ్ పూర్తిచేసుకుని మందమర్రి సర్కిల్ కు కేటాయించబడిన 23 మంది పోలీస్ కానిస్టేబుళ్ళకు ఆదివారం మందమర్రి సర్కిల్ కార్యాలయంలో పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపి నూతన కానిస్టేబుల్లను ఉద్దేశించి మాట్లాడారు.