సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఎలక్ట్రికల్ స్కూటర్ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం రాత్రి సమయంలో కాశిరెడ్డి ఆదిరెడ్డిక ఇంటి షెడ్ ఆవరణలో ఎలక్ట్రికల్ బైక్ ని చార్జింగ్ ఉంచారు. చార్జింగ్ అయిన తర్వాత అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారి చూసేసరికి ఎలక్ట్రికల్ చార్జింగ్ స్కూటర్ అగ్నికి అహుతయింది.