త్వరలోనే కరీంనగర్ జిల్లాలోకి హుస్నాబాద్ : మంత్రి ప్రభాకర్
త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అనుసరించి హుస్నాబాద్ నియోజకవర్గం ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అన్నారు.