బెజ్జంకి మండలంలో విషాదం
బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో దూకిన సంబరి శారద (33) మృతదేహాన్ని బయటకు తీశారు. కూతురు స్పందన (14) మృతదేహం ఇంకా ఆచూకీ దొరకలేదు. ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.