హుస్నాబాద్: నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. బుడిగజంగాల కాలనీ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి, మల్లెచెట్టు చౌరస్తాలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో తెలంగాణ ప్రభుత్వ యువజనశాఖ సెట్విన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని ఇంకా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.