రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి: హరీశ్
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ధర్నా చేయడంపై BRS నేత హరీశ్ రావు 'X' వేదికగా స్పందించారు. 'రాష్ట్రంలో వరి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు మహారాష్ట్రలో గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి.. రైతు ధాన్యం సకాలంలో కొనడం, మద్దతు ధరకు 500 బొనస్ ఇవ్వడం అంటే మభ్య పెట్టి, అబద్ధాలు చెప్పి అధికారం లోకి రావడం కాదు. రైతులు రోడ్డు ఎక్కకుండా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి' అని డిమాండ్ చేశారు.