నర్సాపూర్ నియోజకవర్గం
కొల్చారం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొల్చారం మండలంలోని కిష్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మల్లేష్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులందరూ సమన్వయంతో ఉండాలని సెంటర్ నిర్వాహకులకు సహకరించి ప్రతి రైతు కూడా తన వరి ధాన్యాన్ని తేమశాతం తగ్గిన తర్వాతనే సెంటర్ దగ్గరికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ తంగళ్ళ ప్రభాకర్, పిఎసిఎస్ సీఈవో నవీన్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.