ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధకుడు నెహ్రూ: ఎమ్మెల్యే బాలు

71చూసినవారు
ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధకుడు నెహ్రూ: ఎమ్మెల్యే బాలు
దేవరకొండ: స్వతంత్ర భారతదేశ భవితకు పునాదులు వేసిన దార్శనికుడు స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూ అని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నెహ్రూ వర్ధంతిని ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా చాచాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత తొలి ప్రధానిగా పని చేసిన నెహ్రూ ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధకుడిగా పేరొంది, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాడని అన్నారు.