మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే బీసీ భవన్ లో బీసి జేఏసి నాయకులు పూలే వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. బీసీ జేఏసి కన్వీనర్ మారం శ్రీనివాస్ మాట్లాడుతూ అణగారిన వర్గాలలో జ్యోతులు వెలిగించిన ఆశాజ్యోతి జ్యోతిబా పూలే అన్నారు. ఆయన బాల్య వివాహాల నిర్మూలనకు, పేద వర్గాలకు విద్యను అందించేందుకు, అంటరాని తనాన్ని నిర్మూలించేందుకు ఎంతో పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసి నేతలు పాల్గొన్నారు.