బంజారాల ఆరాధ్య దైవం, సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలను మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి బంజారాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మహా భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈవో బాలాజీనాయక్ మాట్లాడుతూ సంత్ సేవాళాల్ బోధనలు, వారి జీవితం అదర్షనీయమని అన్నారు.