నాంపల్లి మండల ప్రజలకు శుభవార్త. ఈనెల తొమ్మిదవ తారీకు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శంకర్ కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగలరు.