మర్రిగూడ మండలంలోని ఇందుర్తి గ్రామంలో సోమవారం గిరి మారయ్య ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న నామాపురం మాజీ ఎంపీటీసీ ఊరిపక్క సరిత నగేష్ అక్కడికి చేరుకొని మారయ్య మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ. 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిక్షం, దొడ్డి శ్రీను, గిరి యాదయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.