మర్రిగూడ: నర్సింహా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

78చూసినవారు
మర్రిగూడ: నర్సింహా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మర్రిగూడ మండలంలోని కొట్టాల గ్రామంలో పంచాయతీ వర్కర్ ఉబ్బు నర్సింహా ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏర్పుల యాదయ్య సోమవారం నర్సింహా పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదయ్య మాట్లాడుతూ నర్సింహా కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా తో పాటు అతని భార్యకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్