శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని, అంగడిపేట మాజీ సర్పంచ్ నల్లగంటి మల్లేష్, కాంగ్రెస్ నాయకులు గండూరి జనార్దన్ లు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి త్వరలో మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా మంత్రి పదవి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.