తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు జీవోలు సవరించి గెజిట్ విడుదల చేసి 26 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ఏవో మోతిలాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలు సవరించి 26 వేలు బేసిగ్గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.